tg | మద్యం మత్తులో డ్రైవింగ్

tg | మద్యం మత్తులో డ్రైవింగ్

ఆర్టీసీ డ్రైవర్ పై పిర్యాదు చేసిన ప్రయాణీకులు
ఎంట్రీ ఇచ్చి బ్రీతింగ్ టెస్ట్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు*
అడ్డంగా బుక్కైన డ్రైవర్

tg | మెదక్ ప్రతినిధి, ( ఆంధ్ర ప్రభ): మద్యం సేవించి ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను నర్సాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి ఆర్టీసీ బస్సు నడుపుతున్నాడని బస్సు లో ఉన్న ప్రయాణికులు ఆందోళన చేయడం తో పాటు నర్సాపూర్ డిపో అధికారులకు ఫిర్యాదు చేయగా డిపోలోనే బస్సును నిలిపివేశారు. ఆ వెంటనే ప్రయాణికుల్లో కొందరు నర్సాపూర్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయగా డిపోకు చేరుకుని పోలీసులు బస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని బ్రీతింగ్ పరీక్ష చేయడంతో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.మేడ్చల్ నుండి నర్సాపూర్ వస్తున్న బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు,ప్రయాణికుల పట్ల డ్రైవర్ చిరాకు పడడంతో ప్రయాణికులు డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన నర్సాపూర్ ఆర్టీసీ అధికారులు బస్సును నర్సాపూర్ బస్టాండ్ లోనే నిలిపివేశారు.మద్యం సేవించిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రయాణికుల ప్రయాణానికి అంతరాయం ఏర్పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.