ఘనంగా మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు…

ఘనంగా మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు…

కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కడెంలో ఆదివారం కడెం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెక్కల శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీనివాస్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి, కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మల మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే యువజన కాంగ్రెస్ నిర్మల్ జిల్లా కార్యదర్శి మడికే మల్లేష్ యాదవ్, ధర్మాజీపేట సర్పంచ్ శిరీష సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎంఏ రాజేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, రాజు, ధర్మయ్య తదితరులు హాజరయ్యారు.