రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం
రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి రావి చెట్టు వరకు రోడ్డు వెడల్పు విస్తరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణ విషయంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. వారం రోజుల క్రితం నుండి మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణలో భవనాలు కోల్పోయే భాదితులకు మార్కింగ్ చేసి ప్రతి విషయం వివరంగా చెప్పి వారిని ఒప్పించి పోలీసు బందోబస్తు మధ్య రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు.
