గవర్నర్‌ను కలిసిన వెదిరె మేఘా రెడ్డి
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి ఈరోజు లోక్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.అనంతరం పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు.ఫౌండేషన్ అందిస్తున్న సేవలను గవర్నర్ అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
