ప్రజా పాలన ప్రగతి నివేదికలో పోషణ అభియాన్ ప్రదర్శన
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్లో శనివారం ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా పోషణ అభియాన్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో వెంకటేశ్వరి, అంగన్వాడి టీచర్లు మనోహర తదితరులు పాల్గొని పోషణ అభియాన్ కార్యక్రమాలపై వివరాలు అందించారు. పిల్లల పోషణ, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
