Exit Number14 | నలుగురికి తీవ్రగాయాలు

Exit Number14 | నలుగురికి తీవ్రగాయాలు

Exit Number14 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుక్కుగూడ సమీపంలోని ఎగ్జిట్ నెంబర్‌ 14 వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

శనివారం తుక్కుగూడ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా, నిన్న ఇదే ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.