hyd | కుటుంబ సభ్యులకు చంద్రబాబు, లోకేష్ పరామర్శ

hyd | కుటుంబ సభ్యులకు చంద్రబాబు, లోకేష్ పరామర్శ
hyd | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో కలిసి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

డాక్టర్ జీఎన్ నాయుడుతో తనకున్న సుధీర్ఘ పరిచయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రీజెన్సీ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలోనూ, సమాజ సేవలోనూ ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఆయన మరణంతో తెలుగు ప్రజలు ఒక మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.
