టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు మృతి..
టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు మృతి..
గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : ఉమ్మడి కృష్ణా జిల్లా జిల్లా తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ వల్లభనేని బాబురావు గారు శనివారం తెల్లవారుజామున 2:45 గంటలకు పరమపవదించినారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఆయనను పరామర్శించారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటీ చేసారు. వల్లభనేని బాబురావు పార్థవ దేహాన్ని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సందర్శించి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

