రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండల కేంద్రంతో పాటు రాచాపూర్,ధర్మారం, పొట్టపల్లి కే గ్రామాలలో శుక్రవారం ఐకెపి ఆధ్వర్యంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వరి గింజ కొంటుందని నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సోమ భీమ్ రెడ్డి తెలిపారు.

మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు దళారులకు వడ్లు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ద్యేయం అని ఈటెల అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కొండ్ర రాంరెడ్డి, రాచాపూర్ ధర్మారం పొట్టపల్లి సర్పంచులు మహేష్,ముత్యం,ముఖేష్ ఏపిఏం నారాయణ రెడ్డి, డిటీ బాబు సింగ్, నాయకులు అబ్బడి ప్రతాప్ రెడ్డి,కొండ్ర నరేష్ రెడ్డి,ఓస రాజేశ్వర్,బిట్లింగ్ రజనీకాంత్,సిర్ర లింగన్న,కల్లెడ భూమన్న,ఆయా గ్రామాల ఉపసర్పంచ్లు,వార్డు మెంబర్లు సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.