కూటమి పాలనలో అర్హుల గడప వద్దకే సంక్షేమం

కూటమి పాలనలో అర్హుల గడప వద్దకే సంక్షేమం
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
ఆంధ్రప్రభ విజయవాడ : సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 4వ డివిజన్, ఎన్ ఎ సి కళ్యాణ మండపం వెనుక ఉన్న ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ లబ్ధిదారుల ఇళ్ళకు స్వయంగా వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హుల గడపదాకా చేరుతున్నాయని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా పేదలు, వృద్ధులు, దివ్యాంగులు వంటి అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి పింఛన్లు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తుందని అని ఆమె స్పష్టం చేశారు.
ప్రజల సంక్షేమమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికి సహాయం చేరేలా కృషి కొనసాగిస్తామని తెలిపారు. కేవలం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కోసం ఈ నెలలో ఎన్టీఆర్ రూ. 2,720.67 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు రూ.63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో పేదలకు అందించామని తెలిపారు. ఒకటవ తారీకు సెలవు రోజు అయితే ముందురోజే పింఛన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, వెంకటేశ్వరరావు, రాంబాబు తదితరులు ఉన్నారు.

