నాలుగు లేబర్ కోడ్ లను రద్దు కోసం ఉద్యమించాలి

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు కోసం ఉద్యమించాలి

  • 16 చోట్ల ఎర్ర జెండాల ఆవిష్కరణ

నర్సంపేట, ఆంధ్రప్రభ : మే డే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యంగా ఉద్యమ స్పూర్తితో నాలుగు లేబర్ కోడ్ రద్దు కోసం ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రమేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా నర్సంపేట పట్టణంలోని 16 సెంటర్లలో, సీపీఎం , సీఐటీయూ, జెండా ఆవిష్కరణలు చేశారు. వరంగల్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిం చారు. అంబేద్కర్ సెంటర్ వద్ద 10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగాసీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రమేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ చికాగోనగర పురవీధుల్లో పని గంటల తగ్గింపు కోసం జరిగిన విరోచిత పోరాటంలో కార్మికులు అసువులు బాసిన సందర్భంగా ఆనాడు కార్మికుల హక్కులకు గుర్తుగా ఎర్రజెండా వెలిసిందన్నారు. ఈ కాలక్రమం లో ఎనిమిది గంటల పని దినాన్ని సాధించి పెట్టిందని, కార్మికులతో 24 గంటలు పనిచేసే దాస్య సుంకలాల నుండి కార్మిక వర్గానికి విముక్తి కలిగించిన పోరాటమే మేడే అని పేర్కొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 77 వసంతాలు గడిసిపోతున్న కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు దారా దత్తం చేస్తుందని ఆరోపించారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల శ్రమదోపిడి పెరిగిందని పెట్టుబడిదారీ వర్గాలకు కార్మికుల శ్రమను అదనంగా దోచిపెట్టడం కోసం కార్మిక చట్టాల సవరణతో పాటు ఎన్నో పోరాటాలతో సాధించుకు న్న పని గంటల తగ్గింపును ఎనిమిది గంటల నుండి 12 గంటలకు పెంచిన ఘనత ఈ బిజెపి ప్రభుత్వానికి దక్కుతుంద ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ఆర్టీసీ కార్మికుల హక్కులను, ఉపాధి హామీ కూలీలకు పనులు దొరకకుండా నిధుల కోతల విధిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టంలో ఉన్న కూలీల హక్కులను హరించి వేస్తూ పాలన కొనసాగిస్తున్నా యని వారు ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారికి పని భద్రత లేకుండా చేస్తుందని, గ్రామపంచాయతీ కార్మికులు ఆశాలు అంగన్వాడి ఇతర రంగాల కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. అందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ, రైతు ,కూలీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల శ్రమ శక్తిని దోచుకు తింటున్నాయన్నారు.పాలకవర్గంలో ఉన్నవాళ్లు వేల కోట్ల రూపాయలు సంపాదనకు తెగబడుతూ ప్రజలను నడ్డి విరుస్తూ రాజకీయ పబ్బం కడుపు కోవడం కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను జో కొడుతున్నారని హెచ్చరించారు.

సంక్షేమ పథకాలు ఏ రోజు పేదలకు న్యాయం చేసేటివి కావాలని తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజలు వెంపర్లాడకుండా దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం రాబోయే రోజుల్లో విప్లవాన్ని జయప్రదం చేసుకోవడం కోసం ప్రజలందరూ ఐక్యంగా పోరాడి వారి హక్కులను కాపాడే కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లాకమిటీ కోరబోయిన కుమార స్వామి, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీద బాలకృష్ణ,కందికొండ రాజు, హన్మకొండ సంజీవ, ఇప్ప సతీష్, బుర్రీ ఆంజనేయు లు, ఎండి ఫరీదా,వజ్జంతి విజయ,కలకోటి అనిల్, , ఉదయగిరి,నాగమణి, దాసరి నరేశ్ , జగన్నాథం కార్తీక్, కార్మికులు అలువాల రాజు, యాకుబ్, రాజేందర్ కార్మికులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.