కర్నూలు అధికారిపై బదిలీ ఉత్తర్వులు జారీ
కర్నూలు అధికారిపై బదిలీ ఉత్తర్వులు జారీ
కర్నూలు బ్యూరో, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు చెందిన అధికారుల బదిలీలు, నియామకాలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌సి.సి) విభాగం జారీ చేసిన జి.ఓ.ఆర్.టి నం. 880 ప్రకారం కర్నూలుకు సంబంధించిన అధికారి బదిలీ నిర్ణయం తీసుకుంది.
ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుతం కర్నూలులో కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీఎఫ్)గా పనిచేస్తున్న బి.వి.ఏ. కృష్ణమూర్తి, ఐఎఫ్ఎస్ (ఎస్‌ఎఫ్‌ఎస్: 2010) ను బదిలీ చేశారు. ఆయన సేవలను పర్యావరణ, అటవీ శాఖ (E&F Dept.) పరిధిలోకి మార్చుతూ, విశాఖపట్నంలోని ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APFDC Ltd.)లో రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం)గా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ బదిలీ తక్షణమే అమల్లోకి రావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కృష్ణమూర్తి స్థానంలో కొత్త అధికారిని నియమించే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖలో పలు కీలక మార్పుల భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కర్నూలుకు సి. సెల్వం :
అటవీ శాఖ ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్‌లో క్యూసేటర్‌గా పనిచేస్తున్న సి. సెల్వం, ఐఎఫ్ఎస్ (ఆర్.ఆర్: 2012) ను కర్నూలుకు బదిలీ చేశారు. ఆయనను కర్నూలు కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీఎఫ్)గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ బదిలీ తక్షణమే అమల్లోకి రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు అటవీ విభాగంలో పరిపాలన మరింత బలోపేతం చేసేందుకు ఈ నియామకం ఉపయుక్తమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖలో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో ఈ బదిలీ ప్రాధాన్యం సంతరించుకుంది.
