బీజేపీ ప్రభుత్వంలో దుర్మార్గంగా కార్మిక చట్టాలు

బీజేపీ ప్రభుత్వంలో దుర్మార్గంగా కార్మిక చట్టాలు

  • సీపీయం కార్యదర్శి కె.వి.ఆర్ మోహన్ చంద్

శావల్యాపురం, ఆంధ్రప్రభ ; కార్మికుల హక్కులకు భంగం కలిగే విధంగా బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన కార్మిక చట్టాలను తీసుకువచ్చిందని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కె.వి.ఆర్ మోహన్ చంద్ అన్నారు. మండల కేంద్రమైన శావల్యాపురం, మతుకుమల్లి తదితర గ్రామాలలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. కె.వి.ఆర్ మోహన్ చంద్ తదితర నాయకులు పాల్గొని సీఐటియూ, సీపీఎం జెండాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కార్మికుల ఉద్దేశించి కె.వి.ఆర్ మాట్లాడుతూ కార్మికుల రక్తంతో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పది దినాలు కార్మికుల హక్కులకు భంగం కలిగే విధంగా కార్మిక చట్టాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మన హక్కులను మనం రక్షించుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ మండల కార్యదర్శి భువనగిరి వెంకటేశ్వర్లు, సూరాబత్తుని గోవిందరాజులు, రాజారపు రవి, పి.కొండలు, ఏలియా, కె.సువార్త తదితరులు పాల్గొన్నారు.