యూత్ అధ్యక్షుడిగా దండు శ్రీనివాస్ ఎన్నిక

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం గ్రామంలో గత 35 సంవత్సరములుగా వివిధ సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవ అందిస్తూ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజల మెప్పు పొందుతూ వస్తున్న ఆదర్శ కళా ప్రియ యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళ ప్రియా యూత్ వ్యవస్థాపక సభ్యులు మహబూబాద్ టౌన్ ఎస్ఐ ఉల్లి రాముల సూర్య ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడుస్తూ దురాలవాట్లకు గురవకుండా మంచి మార్గంలో పయనించాలని పయనించాలని ఈ సందర్భంగా యూత్ సభ్యులను కోరారు. భవిష్యత్తులో గ్రామంలో నాయకత్వ లక్షణాలు కలగాలంటే యువతే దానికి స్ఫూర్తి అని అన్నారు. యువత సకల కళ నైపుణ్యంతో విద్యాభివృద్ధిలో క్రీడార రంగంలో నైపుణ్యం కలిగి కొనసాగాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది ఆదర్శ కళా ప్రియా యూత్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా దండు శ్రీనివాస్ మరొక్కసారి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది.

అదేవిధంగా యూత్ జనరల్ సెక్రటరీగా మంద భాస్కర్, కోశాధికారిగా కోశాధికారిగా ఇనుముల కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సీనియర్ నాయకులు వేల్పుగొండ ఆనంద్ , జన్ను కట్టయ్య, దండు యాకయ్య , పందుల ఆనందం, సామనపల్లి దేవానందం, గడిపెల్లి యాకయ్య, దండు సురేందర్, కుక్కమూడి యాకయ్య , సింగారపు ప్రభాకర్, గడిపెల్లి వెంకట్ కన్న , వడ్లకొండ కిషోర్ కుమార్, పులిపాక పవన్, సామర్లపల్లి యాకయ్య, దండు బాబు, జన్ను చంటి, బంధు భాష పాల్గొన్నారు.

Leave a Reply