Withdraw | మంగ్లీ సోదరుడి ఖాతా లావాదేవీలపై పోలీసుల దృష్టి

Withdraw | మంగ్లీ సోదరుడి ఖాతా లావాదేవీలపై పోలీసుల దృష్టి
Withdraw | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వందల కోట్ల మైక్రో ఫైనాన్స్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రముఖ జానపద గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ ఖాతా లావాదేవీలపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ ఖాతాకు నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం మూడు విడతల్లో మధు డబ్బులు పంపినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్ల ద్వారా స్పష్టమైంది.
అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శివ చౌహాన్ అకౌంట్‌లోకి డబ్బులు జమ అయిన తర్వాతి రోజే ఆ నగదును పూర్తిగా విత్‌డ్రా చేసినట్లు విచారణలో తేలింది. ఈ లావాదేవీల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో మరికొందరి పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. భారీ స్థాయిలో జరిగిన ఈ ఆర్థిక మోసంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
