MDPA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం….

MDPA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం….
మెడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మెడ్చల్ 297 డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ (MDPA) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానికంగా అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీ చీర్ల రమేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైస్ చైర్మన్ చీర్ల రమేష్ నీ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని సన్మానించారు. ఈ సందర్భంగా చీర్ల రమేష్ మాట్లాడుతూ సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించడంలో పాస్టర్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు…
నూతన నాయకత్వం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.బాధ్యతలు స్వీకరించిన వారిలో అధ్యక్షుడు పాస్టర్ డానియెల్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు పాస్టర్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి పాస్టర్ పాల్ రాజ్, సంయుక్త కార్యదర్శి పాస్టర్ ప్రభు స్వామి, ఖజాంచి పాస్టర్ డేవిడ్ రాజ్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సలహాదారులు స్థానిక క్రైస్తవ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ఎన్నిక పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
