రోడ్డు పై మురుగు నీరు..

రోడ్డు పై మురుగు నీరు..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్, హైదరాబాద్ మార్గంలో రోడ్డు పై మురునీరు పారుతుంది. ఈ విషయంలో స్పందించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రమైనప్పటికీ.. ఎక్కడికి అక్కడ సమస్యలు అలానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ లాంటి అధికారులు ఉన్నప్పటికీ కింది స్థాయి అధికారుల్లో ఎటువంటి చలనం ఉండడం లేదు. అధికారులు స్పందించి.. వెంటనే సమస్యలను పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ మార్గంలో మురుగునీరు రావడం వలన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Leave a Reply