TRS | కవిత పార్టీకి ఈసీ ఆమోదం

TRS | కవిత పార్టీకి ఈసీ ఆమోదం
TRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆమె ఏర్పాటు చేస్తున్న కొత్త రాజకీయ పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’ అనే పేరును అధికారికంగా కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
ఈ మేరకు పార్టీ పేరుకు అనుమతి ఇస్తూ అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు. దీంతో కవిత కొత్త రాజకీయ ప్రయాణానికి మార్గం సుగమమైంది.

టీఆర్ఎస్ పేరును అధికారికంగా పొందడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కొత్త చర్చకు దారితీసింది. త్వరలో పార్టీ కార్యాచరణ, లక్ష్యాలు, ప్రజా అజెండాపై కవిత స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

CLICK HERE TO READ MORE : gold rates|స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
