MLA | చెరువు సుందరీకరణకు 3.14 కోట్లు మంజూరు

MLA | చెరువు సుందరీకరణకు 3.14 కోట్లు మంజూరు

  • ఎమ్యెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

MLA | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : అమృత్ 2.O పథకం కింద 3.14 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూల్ పట్టణం నాగనుల్ చెరువు సుందరీకరణకు సంభందించిన పనులకు గాను చెరువు దగ్గర శంకుస్థాపన చేసి పనులను నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రారంభం చేశారు. ప్రైమరీ స్కూల్ ను, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఉన్న వసతుల గురించి ఆరా తీయడం జరిగింది. అనంతరం గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే వెంట సంభదిత అధికారులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాన్నారు.

MLA
MLA