Feb12 | అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు…
Feb12 | అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు…
Feb12 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐసీఎస్‌ఈ (10వ తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) బోర్డు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఐసీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 30 వరకు నిర్వహించగా, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగాయి. పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూశారు.
విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర వివరాలతో results.cisce.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఫలితాలను తెలుసుకోవచ్చు. మార్కుల మెమోను కూడా అక్కడి నుంచే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలుపుతున్నారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు తదుపరి అడుగులు వేయనున్నారు.
