Fatal accident | 15 మంది మృతి

Fatal accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ పంప్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అధికారులు తెలిపారు.