నాగుర్లపల్లిలో ఆస్తి వివాదం.. వృద్ధురాలిపై దాడి

నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ ; నర్సంపేట మున్సిపల్ పరిధిలోని నాగుర్లపల్లిలో కుటుంబ ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మచ్చిక లక్ష్మీ(65) అనే వృద్ధురాలిపై ఆమె కోడలి తరపు బంధువులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.కుటుంబ ఆస్తి విషయంలో కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి పరస్పర తోపులాటకు, అనంతరం వృద్ధురాలిపై దాడికి దారితీసినట్లు స్థానికులు తెలిపారు. దాడిలో లక్ష్మీకి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Leave a Reply