AP | 85.25 శాతం ఉత్తీర్ణత
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠకు తెరపడింది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. విఫలమైన విద్యార్థులు నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరిన్ని సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
