Himachal Pradesh | అక్కడికక్కడే ఇద్దరు మృతి..

Himachal Pradesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలోని ప్రమాదకర మలుపు వద్ద కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

స్థానికుల వివరాల ప్రకారం… డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతంలో ఉన్న మూల మలుపు వద్ద నియంత్రణ కోల్పోయిన కారు నేరుగా లోయలో పడిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం కలకలం రేపింది. క్షణాల్లో కారు లోయలో పడిపోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ప్రమాద స్థలంలో రక్షణ గోడలు, సేఫ్టీ బారియర్లు లేకపోవడం కూడా ప్రమాద తీవ్రతకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మలుపుల వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.