TG | రాష్ట్రాన్ని అధోగ‌తి పాలుజేస్తున్న కాంగ్రెస్ స‌ర్కార్‌ – ఎంపి లక్ష్మణ్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పాలన చేతకాక అయోమయం, గందరగోళంతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ స‌ర్కార్‌ అధోగతి పాలు చేస్తోంద‌ని బీజేపీ ఎంపీ బంగారు ల‌క్ష్మ‌ణ్ అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ముసుగులో గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందార‌ని, ఆ ప్రాజెక్ట్ ఉత్తర భాగం రైతులకు నష్టం చేశార‌ని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ రైతులకు న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించార‌ని, ఇప్పటి వరకు న్యాయం చేయలేక‌ద‌ని అన్నారు. అలైన్ మెంట్ మార్చలేదని ఆయన చెప్పారు. ఉత్తర భాగం రైతులు అలైన్మెంట్ మార్చాలని అడిగితే పట్టించుకోని ముఖ్యమంత్రి దక్షిణ భాగంలో మాత్రం మార్చార‌న్నారు. దీనిలో ఆంతర్యం ఎంటి.. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాలని అనుకుంటున్నారా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.

ఆర్ఆర్ఆర్ డీపీఆర్ లోప‌భూయిష్టం
ఇక, రిజనల్ రింగ్ రోడ్డ్ ప్రాజెక్ట్ డీపీఆర్ లోపభూయిష్టంగా ఉంది అని భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ మీద ఎదురు దాడి చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ చేసిన తప్పిదాలే ఆయన చేస్తున్నార‌న్నారు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది కాబోతుంది అని విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *