మొక్కజొన్న కొనుగోళ్లు సాఫీగా కొనసాగుతున్నాయి..
మొక్కజొన్న కొనుగోళ్లు సాఫీగా కొనసాగుతున్నాయి..
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ కుచూకుల్ల దామోదర్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు5 మండలాల్లో సాఫీగా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. టిఆర్ఎస్ చేసిన ధర్నా ఆందోళన పై స్పందించి దామోదర్ రెడ్డి వీడియో విడుదల చేశారు ఆయన మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.
రైతులు సాగుచేసిన మొక్కజొన్న దిగుబడి అధికంగా వచ్చిందని ఎకరాకు 40 నుండి 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని దాంతో భారీగా మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని చేస్తున్నారని ప్రభుత్వం 200400 క్వింటాలకు ధర ఇవ్వడం వల్ల బయట మార్కెట్లో 1800 కొంటున్న నేపథ్యంలో రైతుకు వెయ్యి రూపాయలు లాభం ప్రభుత్వం చేస్తున్నదని రైతులు సంతోషంగా ఉంటే ధర్నా పేరుతో టిఆర్ఎస్ చేస్తున్నదనిఈ విషయాన్ని రైతులు గ్రహించాలని కోరారు .ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడంలో కొంత ఇబ్బందులు వచ్చాయని అయినా గోడౌన్స్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశామని అందులో భాగంగా వనపట్ల ఇతర ప్రాంతాలలో ఉన్న గోడౌన్లను తెలకపల్లి లో ఉన్న ఫంక్షన్ హాల్‌ను తీసుకొని మొక్కజొన్నలను చెప్పారు.
గత 15 రోజులుగా కొనుగోళ్లు నిరంతరం జరుగుతున్నాయన్నని హమాలీల కొరతతో లోడింగ్‌లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, బీహార్ కూలీలు వస్తేనే పనులు పూర్తవుతున్న పరిస్థితి ఉన్నదని అందుకే మొక్కజొన్న తరలింపులో ఆలస్యం అవుతున్నదని వివరించారు. టిఆర్ఎస్ వాళ్లు ధర్నాల పేరుతో రైతులను రెచ్చగొట్టొద్దని , గుంటనక్కల వచ్చిబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజకీయాలు తగవని మొక్కజొన్న కొనుగోళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
గత పదేళ్లలో “మొక్కజొన్న వేయొద్దు, కొనుగోలు చేయం” అంటూ ఆ ప్రభుత్వ హయాంలో మాట్లాడిన విషయాలు అందరికీ తెలిసిందేనని అన్నారు అధికారం ఉన్నప్పుడే సహాయం చేస్తారా అధికారంలో లేనప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడి సహాయం చేయాలని ఎమ్మెల్సీ హితోవుపలికారు. కనీసం రైతుల బాధను అర్థం చేసుకోవాలని, రైతులకు సహకరించాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కోరారు.
