చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బస్ స్టాండ్ సమీపంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బుధవారం ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో తోడ్పడతాయని ఆయన అన్నారు. అవసరమైన చోట్ల ప్రజల సౌకర్యం చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సేవా నిరతి తో ముందుకు రావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, సిఐ యాలాద్రి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కౌన్సిలర్లు పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్ ,కాంగ్రెస్ నాయకులు ఎంఏస్ విజయ్ కుమార్, నీలం వెంకటస్వామి, చింతకింది మురళి, శికిలం శ్రీనివాస్,బరిగే శ్రీనివాస్, ఆలేటి అనిల్, మల్లెల శ్రీకాంత్, ఎండి ఇమ్రాన్, కాసుల భాస్కర్ పాల్గొన్నారు.
