వడదెబ్బకు గురైన మహిళ కోసం..

వడదెబ్బకు గురైన మహిళ కోసం..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధి భద్రాచలం ప్రాంతంలోని మారుమూల పల్లె గ్రామానికి చెందిన గుత్తికోయ ఆదివాసి మహిళ మడవి లక్ష్మి వడదెబ్బకు గురై రక్తం శాతం తక్కువ ఉన్నందున, ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో ఆళ్లపల్లి మండల పరిధిలో మర్కోడు జిన్నేలగూడెం గ్రామానికి చెందిన అంబోజు సాయి హుటాహుటినా భద్రాద్రి కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో బ్లడ్ డొనేషన్ చేశాడు. దీని వలన ఆమె కోలుకుంది.

సాయి చేసిన మంచి పనిని స్థానిక ఎస్ఐ ముత్తినేని సోమేశ్వర్, వ్యాపార వర్గాలు గౌరిశెట్టి శ్రీనివాసరావు, తాళ్లపల్లి రామ్మూర్తి, అబ్బు నాగేశ్వరరావు, తాళ్లపల్లి నాగేష్, అనుమోల వెంకటేశ్వరరావు మర్కోడు, నరెడ్ల వెంకన్న, శ్రీనివాసరావు, సంక ప్రభాకర్, బూరుగడ్డ రాములు, వెంకటేశ్వర్లు,మహమ్మద్ హకీం, నయ్యుమ్, నువ్వుల నరసింహారావు, బూర్ణ రాంబాబు, వగల బోయిన సతీష్, రడం నారాయణ, కొమరం హనుమంతరావు, వెంకటేశ్వర్లు, తాటికొండ వెంకట చారి, అనుమోల వెంకటేశ్వరరావు, పాత్రికేయులు బిక్షం, సత్యరాజ్, సదానందాచారి, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, ప్రభాకర్, సతీష్, చంద్రశేఖర్, చారి మండల వ్యాప్తంగా అధికారులు వివిధ పార్టీ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించారు.

వేసవికాలంలో ఎండ తీవ్రత వలన వడదెబ్బకు గురైన ఆదివాసి మహిళ మడవి లక్ష్మికి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న సాయి సేవలు అమోఘమని కొనియాడారు. తన ప్రాణంతో సమానంగా ఇతరులకు రక్తదానం చేసి మహిళ లక్ష్మి ప్రాణాలను నిలబెట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది ఎంతో పుణ్యకార్యమని, ఒక వ్యక్తిని, కుటుంబాన్ని నిలబెట్టిన వారుగా సమాజంలో మిగిలిపోతారని ప్రశంసించారు. రక్తదానం చేయడం వలన, ఆరోగ్యం ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యకరంగా చురుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.