వానకాలం సాగుపై రైతులకు సూచనలు..

మునుగోడు, ఆంధ్రప్రభ : రైతులు వానకాలం పంట సాగుకు ముందస్తుగా సిద్ధమై శాస్త్రీయ పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ బాబు విత్తనాల ఎంపిక, చీడపీడల నివారణ, నేలల నిర్వహణపై వివరించారు.సాయి ప్రియ అధిక సాంద్రత పత్తి సాగు లాభాలను తెలిపారు. ఏడీఏ వేణుగోపాల్ పంట మార్పిడి, పురుగుమందుల పిచికారీ, ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి పద్మజ సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చల్మెడ సర్పంచ్ బండిమీద యాదయ్య, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply