AP | యనమలకుదురులో ఎంపీ చిన్ని దంపతుల పూజలు

AP | యనమలకుదురులో ఎంపీ చిన్ని దంపతుల పూజలు

  • శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం, ప్రత్యేక పూజలు..
  • ఆలయ అధికారుల ఘన స్వాగతం
  • ప్రజల సుఖశాంతుల కోసం ప్రత్యేక ప్రార్థనలు

AP | ఆంధ్రప్రభ, విజయవాడ ; విజయవాడ సమీపంలోని యనమలకుదురు కొండపై వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఎంపీ కేశినేని చిన్ని తన సతీమణి జానకి లక్ష్మితో కలిసి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతి సమేతంగా స్వామివారిని దర్శించుకున్న దంపతులకు ఆలయ అధికారులు, సిబ్బంది మేళతాళాలతో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండల పరిధిలో ఉన్న ఈ శివాలయం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది.

ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, యనమలకుదురు ఆలయం స్థానికులకు మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులను ఆకర్షిస్తున్న ముఖ్యమైన దేవాలయాలలో ఒకటని తెలిపారు. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. తన పార్లమెంటు పరిధిలో అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశినేని కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.