హోవార్డ్ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ వేడుకలు..
హోవార్డ్ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ వేడుకలు..
నిజామాబాద్, ఆంధ్రప్రభ: నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ హోవార్డ్ హైస్కూల్ నందు కేజీ గ్రాడ్యుయేషన్ వేడుకలు 2025-26 అత్యంత వైభవంగా నిర్వహించారు “చిన్న అడుగులు, హో వార్డ్ తో పెద్ద కలలు”* అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు*హోవార్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్ నుండి యాజమాన్య ప్రతినిధులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించారు. కేజీ . విద్యార్థులు ఎరుపు రంగు గౌన్లు, గ్రాడ్యుయేషన్ టోపీలతో హాజరై అందరినీ అలరించారు.చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు తల్లిదండ్రులను మంత్రముగ్ధులను చేశాయి.
గెస్ మీ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులను భాగస్వాములను చేశారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాము అని కరస్పాండెంట్ టీవీఆర్ మూర్తి ప్రిన్సిపల్ శశికళ, ప్రతినిధులు లక్ష్మిలు తెలిపారు తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తున్నాము” అని వారు అన్నారు.యాజమాన్యము కరస్పాండెంట్ టీవి ఆర్ మూర్తి, ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ప్రతినిధులు లక్ష్మీ హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. పరిమిత వనరులతో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన నిజామాబాద్ హోవార్డ్ కోఆర్డినేటర్ నవీన , ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నాము అని అన్నారు. హోవార్డ్ హైస్కూల్ విద్యతో పాటు విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం”* అని కొనియాడారు. విద్యార్థులలో 2025 26 అకాడమిక్ ప్రస్థానంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అలాగే వార్షిక సంవత్సరంలో అత్యధికంగా పాఠశాలకు హాజరైనటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. హోవార్డ్ హైస్కూల్లో కేజీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో చిన్నారులు, యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయ బృందం. తదితరులు పాల్గొన్నారు.
