పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం..
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం..
గుండాల/ఆళ్లపల్లి ఆంధ్రప్రభ : భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా తమ పై ఎంతో నమ్మకాన్ని ఉంచి పదవి బాధ్యతలు కట్టబెట్టడంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ వంతు కృషి చేస్తానని భద్రాద్రి జిల్లా కార్యదర్శి, పీఎస్ఆర్ పివిఆర్ యువసేన కాంగ్రెస్ మండల కోఆర్డినేటర్ షేక్ ఖదీర్ అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుండాల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ప్రాంగణంలో కాంగ్రెస్ గుండాల మండల కమిటీతో పాటు కాంగ్రెస్ మండల నాయకుడు వాంకుడోత్ బికోజి (అజయ్) అధ్యక్షతన ఘనంగా సన్మానించడం ఎంతో గర్వకారణన్నారు. భద్రాద్రి జిల్లా కమిటీ నూతన పదవి బాధ్యతలు చేపట్టిన పొంబోయిన ముత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులుగా షేక్ ఖదీర్ జిల్లా కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టడంతో గుండాల మండల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నీరాజనాలు పట్టడం సత్కరించడం శుభ పరిణామమన్నారు. సన్మాన కార్యక్రమానికి వివిధ గ్రామపంచాయతీల సర్పంచులు, మాజీ, తాజా ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ గుండాల మండల అధ్యక్షులు తోలెంసాంబయ్య, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, బిఎస్పి మండల అధ్యక్షులు బొమ్మెర రాంబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బొమ్మెర్ల నాగేష్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మానాల వెంకన్న వారి బృందం, గుండాల మండలంలోని పుర ప్రముఖులు మానాల నారాయణమూర్తి,షేక్ షాబీర్, బత్తిని సాయన్న, డాక్టర్ మహిమూద్, యాసారపు తిరుపతి, తడిశెట్టి నాగరాజు రాంబాబు ఘనంగా సన్మానించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
ఈ ఘన సన్మాన గ్రహీతలు పొంబోయిన ముత్తయ్య, ఖదీర్ పార్టీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో కీలక పదవులు అప్పగించడంతో కాంగ్రెస్ పార్టీకి, అధినాయకత్వం మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంతో రుణపడి ఉంటామన్నారు. రాష్ట్ర రెవిన్యూ సమాచార గృహ నిర్వహణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని, మా పై ఉంచిన నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా గుండాల మండల సమగ్ర అభివృద్ధికై తోడ్పడతామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ మారుమూల మండలమైన గుండాల అభివృద్ధినే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. మా సన్మాన కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి గుండాల పుర ప్రముఖులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, కులసంఘాల నాయకులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలపడం జరుగుతుందని ఖదీర్ ముత్తయ్యలు పేర్కొన్నారు.
