మార్కెట్ మార్పులకు అనుగుణంగా వ్యూహం

మార్కెట్ మార్పులకు అనుగుణంగా వ్యూహం

ముంబై: మారుతున్న మార్కెట్ డైనమిక్స్, పెట్టుబడిదారుల అవసరాలకు మరింత అనుగుణంగా, సమర్థంగా ఉండేందుకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ థీమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అగ్రెసివ్ హైబ్రిడ్ యాక్టివ్ ఎఫ్‌ఎఫ్ అనువైనదిగా ఉంది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫ్రేమ్‌వర్క్‌లోని అగ్రెసివ్ హైబ్రిడ్ విభాగం కింద దీన్ని వర్గీకరించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2025 ఎఫ్‌ఓఎఫ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఫండ్ 65-80 శాతం ఈక్విటీ స్కీమ్లకు, 20-35 శాతం డెట్ స్కీమ్లకు కేటాయిస్తుంది. ఇది స్థిరత్వాన్ని పెంచుతూ, స్మాల్, మిడ్ క్యాప్ విభాగాలతో సహా ఈక్విటీల్లో వ్యూహాత్మక పెట్టుబడులకు అవకాశం ఇస్తుంది.

ఈ ఫండ్ దీర్ఘకాలిక పనితీరు, మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఎదుర్కోగల దాని సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. డిసెంబర్ 18, 2003న ప్రారంభంలో లక్ష రూపాయల ఏకమొత్తం పెట్టుబడితో, మార్చి 31, 2026 నాటికి ఇవి 20.34 లక్షలకు పెరిగి ఉండేది. ఇది 14.47% సీఏజీఆర్ కు సమానం. గత మూడు, ఐదు సంవత్సరాల్లో ఈ ఫండ్ వరుసగా 15.1%, 14.9% సీఏజీఆర్‌ను అందించింది. ఇదే కాలంలో 12.6%, 11.4% రాబడిని ఇచ్చిన తన బెంచ్‌మార్క్ అయిన నిఫ్టీ 200 టీఆర్ఎస్ఐని ఇది అధిగమించింది.

క్రమపద్ధతిలో పెట్టుబడి (ఎస్ఐపీ) పెట్టే వారికి ఈ వ్యూహం స్థిరమైన లాభాలను చూపించింది. గత 10 సంవత్సరాలుగా నెలకు 1000 రూపాయల చొప్పున చేసే ఎస్ఐపీ 12 లక్షల పెట్టుబడిని 21 లక్షలకు పెంచింది. ఇది 11% సీఏజీఆర్ ను అందించింది. 5 సంవత్సరాల కాలపరిమితిలో 9.4%, 10 సంవత్సరాల వ్యవధిలో 9.8% రాబడులు ఇచ్చింది.

పోర్ట్ఫోలియో దృక్కోణం నుంచి చూస్తే ఈ ఫండ్ వివిధ రకాల పథకాల వైవిధ్యభరితమైన మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది. పోర్ట్ఫోలియోలో దాదాపు 35% వాటా కలిగిన టాప్ ఐదు హోల్డింగ్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ (11%), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ (9.5%), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ (6.4%), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ (5.6%), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ (5.4%) ఉన్నాయి.

థీమాటిక్ ఇన్వెస్టింగ్‌ను యాక్టివ్ అసెట్ అలోకేషన్‌తో కలపడం అనే తన విశిష్టమైన విధానం ఈ వ్యూహాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్‌లా కాకుండా, ఈ ఫండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ నిర్మాణాన్ని అనుసరిస్తుంది. ఇది చురుకుగా నిర్వహించబడే ఎంపిక చేసిన ఈక్విటీ, డెట్ స్కీమ్లలో కేటాయింపులు చేస్తుంది. ఇది వివిధ రంగాలలో, మార్కెట్ క్యాపిటలైజేషన్లలో వైవిధ్యీకరణకు అవకాశం కల్పిస్తూ, పలువురు ఫండ్ మేనేజర్ల నైపుణ్యం నుంచి ప్రయోజనం పొందేలా చేస్తుంది. ఆర్థిక చక్రాలతో అవకాశాలు మారుతున్న కొద్దీ వాటిని సద్వినియోగం చేసుకునేలా ఈ పోర్ట్ఫోలియో రూపొందించబడింది.

ఇదే సమయంలో, డెట్ ఆధారిత ఫండ్లకు కేటాయింపులు సమతుల్యతను అందిస్తూ, అనిశ్చితి కాలంలో నష్టభయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అగ్రెసివ్ హైబ్రిడ్ యాక్టివ్ ఎఫ్‌ఎఫ్ పెట్టుబడిదారులకు సురక్షితమైన, అవకాశాలతో కూడిన విధానాన్ని అందిస్తూ, దీర్ఘకాలిక సంపద సృష్టికి అత్యుత్తమ పరిష్కారంగా నిలుస్తుంది.

Leave a Reply