పెట్రోలియం ఉత్పత్తుల కొరతను నివారించండి

పెట్రోలియం ఉత్పత్తుల కొరతను నివారించండి

-ఆకుల శ్రీనివాస్ డిమాండ్

భవానిపురం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ , వంటగ్యాస్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల కొరతను నివారించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే వంటగ్యాస్ విషయంలో విపరీతంగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని, ఒక్కో సిలిండర్ రూ. 3000 వరకు విక్రయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల కొరత మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుండి దిగుమతులను పెంచి దేశీయ కొరతను తీర్చాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రజలకు నిత్యావసరమైన ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని ఆకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply