రైతులను ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
రైతులను ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
- జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
బిచ్కుంద, (కామారెడ్డి), ఆంధ్రప్రభ : రైతులను ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పుల్కల్ సొసైటీ కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు రైతుబంధు, పలు పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గత ప్రభుత్వం అప్పులు చేసి ఆ అప్పు నో తీర్చుకుంటూ సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు, జొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులను కోరారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని ఆయన వివరించారు. రైతుల వద్ద ఎకరాకు 26 క్వింటాళ్లు చొప్పున కొనుగోలు చేస్తామని, ధర 2400 క్వింటాలు మద్దతు ధరతోని కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. మొదటగా మాజీ ఎంపిటిసి పురుషోత్తం పటేల్ ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పుల్కల్ సర్పంచ్ సంతు పటేల్, జిల్లా నాయకులు ధర్పల్లి సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాగనాథ్, కాంగ్రెస్ పుల్కల్ యువ నాయకులు వెంకు పటేల్, బిచ్కుంద మున్సిపల్ కౌన్సిలర్ దరిపల్లి గంగాధర్, పుల్కల్ సొసైటీ సెక్రటరీ సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
