Congress | బీసీ మహిళలకు గుడ్‌న్యూస్

Congress | బీసీ మహిళలకు గుడ్‌న్యూస్

Congress | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీసీ మహిళలకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రీగా కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందశాతం సబ్సిడీతో ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి మందికి చొప్పున కుట్టు మిషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మ‌హిళ‌లు స్వ‌యం ఉపాధితో పారిశ్రామిక వేత్త‌లుగా ఎద‌గాల‌న్న‌దే ప్ర‌భువ్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. త్వరలో కలెక్టర్ల నేతృత్వంలో లబ్ధిదారుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని మంత్రి పొన్నం వెల్ల‌డించారు.

Leave a Reply