స్వీయ గణన కార్యక్రమం ప్రారంభం

స్వీయ గణన కార్యక్రమం ప్రారంభం
- తహసిల్దార్ ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్
- మార్కెట్ వైస్ చైర్మన్, సర్పంచ్‌లతో వివరాల నమోదు
రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని రాగన్న గూడెం గ్రామంలో ఆదివారం నుంచి ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) కార్యక్రమాన్ని గౌరవ తహసిల్దార్ ఎం. శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి , రాయపర్తి గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి ల ఇంటికి వెళ్లి తహసిల్దార్ శ్రీనివాస్ స్వయంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేయించారు.
కుటుంబ వివరాలు, ఆర్థిక, సామాజిక అంశాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించి, ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వీయ గణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ ఈ సందర్భంగా కోరారు. సరైన వివరాలు అందిస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల గిర్దావార్లు చంద్రమోహన్ , సంధ్యారాణి , ఎంపీఎస్ఓ కళ్యాణ్ , జీపీఓలు పూజారి సురేష్ , సంజీవయ్య , కారోబార్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
