చదువు జ్ఞానాన్ని పెంచుతుంది….

చదువు జ్ఞానాన్ని పెంచుతుంది….

ఇంటర్ విద్యార్థులకు ప్రతిభ జ్ఞాన పురస్కార్ అవార్డులు..
అంబేద్కర్ భావజాలం విద్యార్థుల్లో మెలగాలి…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేటి విద్యార్థులు చదువులో చక్కగా చదువుకొని భవిష్యత్తులో స్థిరపడాలని నైతిక విలువలతో తల్లిదండ్రుల కు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని వక్తలు పేడిసేల విజయ్ కుమార్, కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ఒంట్ల అమర్నాథ్ రెడ్డి, పెడిసెల సునీల్, పబ్బతి రవికుమార్, బెల్లం రాజకుమార్ శివరామిరెడ్డి లు పేర్కొన్న రు.

డాక్టర్ భీంరావు అంబేద్కర్ పెడిసెల అనిల్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆదివారం నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో ఇంటర్మీడియట్ మొదటి రెండు సంవత్సరంలో అత్యధిక మార్కుల ప్రతిభ చాటిన విద్యార్థులకు జ్ఞాన పురస్కారం అవార్డులను అందజేశారు. అత్యధిక మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అంబేద్కర్ చిత్రపటంతో పాటు, రాజ్యాంగ పుస్తకం,నగదు బహుమతి పురస్కారాలు అందజేశా రు. అవార్డు సాధించిన విద్యార్థులు జాహ్నవి గ్యారే మానస,సన్నీ,హరిణి,కాశన్న, నిరోషా, కార్తీక్ అఖిల, సువర్ణరేఖ, వాణిశ్రీ, కీర్తిన, శ్రీపతుల మానస లు మాట్లాడుతూ దేశ సేవకు ఉపయోగపడే విధంగా చదివిన చదువుకు సార్ధకత చేకూరుస్తామని పేర్కొన్నారు.

విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు కనుగుణంగా ప్రతి విద్యార్థి నూతన టెక్నాలజీతో ఏఐ అనుబంధంతో నైతిక విలువలతో కంప్యూటర్ యుగం కనుగొనంగా విద్యా బోధన సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బండి ప్రకాశమయ్య బండి పేతురు గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply