బాసరలో ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ పూజలు
బాసరలో ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ పూజలు
బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయానికి చేరుకున్న వేరిని ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి హారతి నిచ్చి ఆశీర్వదించారు. ఆశీర్వచనమండపంలో డైరెక్టర్ హరీష్ శంకర్ శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర అమ్మవారి విశిష్టతను ఆలయ అర్చకులు పండితులు ఆయనకు వివరించారు.

