politics | ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్

politics | ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్

politics | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ శివ్ ప్రతాప్ ఆమోదం తెలపడంతో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రక్రియకు ముగింపు పలికింది.

గత ఏడాది ఆగస్టు 30న రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఎమ్మెల్సీ నియామకానికి గవర్నర్‌కు పంపింది. అయితే అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయింది.

ఇటీవల ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అజారుద్దీన్ మంత్రి పదవి ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపైనే ఆధారపడి ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఈరోజు గవర్నర్ శివ్ ప్రతాప్ ఆ ఫైల్‌పై సంతకం చేయడంతో ఇద్దరి నియామకానికి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో అజారుద్దీన్ మంత్రిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లకు ఆమోదం లభించడంతో అధికార వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.