తేమ శాతం పరిశీలించి కొనుగోలు చేయాలి..

తేమ శాతం పరిశీలించి కొనుగోలు చేయాలి..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : వరి ధాన్యం తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు చెప్పారు. శుక్రవారం మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ రికార్డులను పరిశీలించి సిబ్బందికి సలహాలు సూచనలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతు నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని అలాట్మెంట్ ఇచ్చిన రైస్ మిల్లులకు మాత్రమే పంపించాలని సూచించారు. ఈ విషయంలో సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఆయన వెంట సెంటర్ ఇన్చార్జ్ రమేష్, సొసైటీ సీఈఓ రాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
