వైభవంగా సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవాలు

వైభవంగా సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవాలు

​ములకలపల్లి, ఆంధ్రప్రభ: ములకలపల్లి మండల పరిధిలోని వీకే రామవరం గ్రామంలో వెలసిన సమ్మక్క-సారలమ్మ, మహాలక్ష్మి తల్లి జాతర మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ముగిశాయి. గత ఐదు సంవత్సరాలుగా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్న ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9.30 గంటలకు చిలకలగుట్ట నుండి కంకవనం తెచ్చే కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. అనంతరం అమ్మవార్లను గద్దెపై ప్రతిష్టించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

​అట్టహాసంగా అన్నదానం…
​మధ్యాహ్నం 12.30 గంటల నుండి జాతరకు విచ్చేసిన భక్తుల కోసం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ​ఈ ఉత్సవాలను గురువులు గుంజె భవాని, దేవరబాల తాటి ఈశ్వరమ్మ, గద్దె పూజారి తాటి చింపెయ్య నేతృత్వంలో నిర్వహించారు. జాతర నిర్వాహకులు తాటి రవి – సరోజిని, కమిటీ సభ్యులు సోడె స్వరాజ్ శాంతిప్రియ, ఊకే ఈశ్వరి, మడకం సాయి, సున్నం వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Leave a Reply