హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం…

హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం…

  • ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు
  • జూపూడిలో క్లిప్ యువర్ హెల్మెట్ పై అవగాహన

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : హెల్మెట్ ధరించడమే కాకుండా క్లిప్ పెట్టుకోవడం అత్యవసరమని ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు అన్నారు. జూపూడి నిమ్రా కళాశాల కటింగ్ వద్ద గురువారం క్లిప్ యువర్ హెల్మెట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకమన్నారు. చాలామంది వాహనదారులు కేవలం జరిమానాలు తప్పించుకోవడానికి హెల్మెట్ ధరిస్తున్నారని, క్లిప్పు పెట్టుకోకపోవడం వల్ల ప్రమాద సమయంలో హెల్మెట్ తల నుంచి విడిపోయి తీవ్ర గాయాల పాలవుతున్నారని చెప్పారు.

ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా వాహనదారులను నిలిపి హెల్మెట్ ను సరైన విధంగా ఎలా ధరించాలి? ముఖ్యంగా క్లిప్ ఎలా బిగించాలి? అనే విషయాలను పోలీసులు స్వయంగా చూపించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply