ఆంధ్రప్రభ కథనానికి స్పందన..

ఆంధ్రప్రభ కథనానికి స్పందన..

  • జాతి కుంట చెరువు భూములను పరిరక్షించేందుకు
  • రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్అధికారులు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : కబ్జా కోరల్లో బెల్లంపల్లి పట్టణంలోని రైల్వేరడగంభాల బస్తిలో గల జాతికుంట చెరువు అనే కథనం గురువారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ జాతికుంట చెరువు భూములను కాపాడేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్, తహసిల్దార్ల ను ఆదేశించారు. వెంటనే ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ సునీత, వర్క్ ఇన్స్పెక్టర్ దాసరి శంకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, జీపీవో క్లస్టర్ -1 రాజలింగు, లస్కర్లు దుర్గయ్య,బిట్టు లు హుటాహుటిగా చెరువు వద్దకు చేరుకున్నారు.

చెరువు ఎఫ్ టి ఎల్ లెవెల్ వరకు ఎంత భూమి ఉంది, ఎంత కబ్జా కు గుగురైంది అనే కోణంలో సర్వే పరికరాలతో భూ సర్వే చేపట్టారు. జాతి కుంట చెరువు ఎఫ్ టీ ఎల్ లెవల్ వరకు 8 ఎకరాల భూమి ఉందని,బఫర్ జోన్ వరకు 2 మీటర్ల వరకు ఉన్న కట్టడాలను ఇళ్ల పునాదులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

అమృత్ 2. 0 పథకం ద్వారా రూ,, 156.20 లక్షల రూపాయల తో జాతి కుంట చెరువు పునరుజ్జీవ పనులను ఎమ్మెల్యే గత నెలలో ప్రారంభించిన విషయం విధితమే. ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు చెరువు భూమి హద్దులను రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల జాయింట్ సర్వే ద్వారా నిర్ధారించి హద్దులు ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వే చేపట్టి నట్లు అధికారులు ఆంధ్రప్రభ కు తెలిపారు.

జాతికుంట చెరువు సర్వే పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

ఆక్రమణల కూరల్లో జాతికుంట చెరువు అనే కథనంపై బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి స్పందించి సర్వే జరుగుతున్న పనులనుఆమె పరిశీలించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం సర్వే నిర్వహించి జాతికుంట చెరువు భూములనుకాపాడేలాచూడాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇచ్చిన ఆదేశాల మేరకు చెరువు పనులను పరిశీలించినట్లు స్వాతి తెలిపారు. నిబంధనల విషయంలో అధికారులు ఎలాంటి ఆనోదోళన పడవద్దని మున్సిపల్ చైర్ పర్సన్ అధికారులకు సూసించారు. చైర్ పర్సన్ వెంట 9 వ వార్డు కౌన్సిలర్ కాంపెల్లి రాజం, కాంగ్రెస్ నాయకులు కంకటి శ్రీనివాస్, దావ రమేష్ బాబు, రాళ్ల బండి ఈశ్వర్ తదితరులున్నారు.