ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకుల పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నుండి సమ్మెబాట పట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సమ్మెకు ఉట్నూర్ బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే డిపోలో నిలిచిపోయాయి. ఉద్యోగులు సమ్మెలో దిగి నిరసనలు వ్యక్తం చేశారు. ఉట్నూర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఉట్నూర్ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు, నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే.. సార్వత్రిక ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను రెగ్యులరేషన్ చేస్తూ ప్రభుత్వంలో విలీనం చేస్తామని అన్ని విధాల ఆదుకుంటామన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలు నీటిమట్టలుగా మిగిలిపోయాయని.. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వారి డిమాండ్లను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల్ శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్, సీనియర్ నాయకులు సిపతి లింగాగౌడ్, బీజేవైఎం కార్యదర్శి బొడ్డు కిరణ్, మండల కార్యదర్శి కాల్వ రవి, కుటికెల రమేష్, నరసయ్య, ఆర్టీసీ ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply