లాలా సముందర్లాల్ పేరిట చలివేంద్రం ప్రారంభం

ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లాల ముత్తునూర్ గ్రామంలో లాలా సముందర్లాల్ పేరిట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీఆర్‌డీఓ (ప్రత్యేక అధికారి) రాథోడ్ రవీందర్, గ్రామ సర్పంచ్ రితే విట్టల్ మంగళవారం ప్రారంభించారు.

ఉట్నూర్–ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామానికి చెందిన లాలా సముందర్లాల్ జీవించిన కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, చలివేంద్రం ద్వారా ప్రజల దాహం తీర్చడంలో ముందుండేవారని స్థానికులు గుర్తుచేశారు.

ఆయన మరణానంతరం ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆయన కుమారుడు దృప కుమార్ జైస్వాల్ ముందుకు వచ్చి చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మహిళా ఎస్టీ కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి, గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, గ్రామ కారోబారి ప్రహ్లాద్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply