నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4..

నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4..
పి.4.మార్గదర్శి బొండా సిద్ధార్థ
పాయకాపురం, ఆంధ్రప్రభ : నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4 పథకం ఉందని .పి.4.మార్గదర్శి, టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ అన్నారు. జీరో పావర్టీ పి.4 మార్గదర్శి బంగారు కుటుంబం ద్వారా కటారి శివకుమారి కుటుంబానికి 45,000 వేలతో స్థిరమైన ఉపాధి నిమిత్తం చెరుకు రసం బండిని సిద్దార్ధ అందజేసి, మంగళవారం పాయకాపురం రైతు మార్కెట్ వద్ద ప్రారంభించారు.ఒక నిరుపేద కుటుంబానికి ఆశాకిరణంగా నిలిచే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈపథకం స్ఫూర్తితో, సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బొండా ఉమా అనేకమందికి చేయూత అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయం ఇంచార్జి ఘంటా కృష్ణమోహన్, 62వ డివిజన్ టీడీపీ ఇంచార్జి పైడి శ్రీను, లక్కీశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.
