మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

తొర్రూరు టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ : డివిజన్ లోని పెద్దవంగర వాస్తవ్యులు ప్రముఖ కవి వాగ్గేయకారుడు చిలుక భాస్కర్ తాను రచించిన పెద్ద వంగర చరిత్ర ను తెలిపే మావూరి మట్టి సింగారం గ్రంధావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని తొర్రూరులో కలిసి ఆహ్వానించారు.

తన పూర్వ గ్రంథం తూరుపువాడను అందజేశారు. ఈ సందర్భంగా చిలుక భాస్కర్ మాట్లాడుతూ తన స్వగ్రామ పెద్దవంగర పూర్వ చరిత్రతో కూడిన మావూరి మట్టి సింగారం నూతన గ్రంథమును అంకిత స్వీకారాని ఎమ్మెల్యేను కోరగా అంగీకారం తెలిపిందని, గ్రంథావిష్కరణకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఆహ్వానించగా సానుకూలంగా స్పందించి తమ అంగీకారాన్ని తెలియచేసినందుకు రచయిత కృతజ్ఞతలు తెలిపారన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు, గుండాల నర్సయ్య చిలుక సంజీవరావు వివిధ గ్రామాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply