రైతు భరోసా సభ విజయవంతం…
రైతు భరోసా సభ విజయవంతం…
ప్రజలకు మంత్రి శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు…
కాటారం రూరల్, ఆంధ్రప్రభ : కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి భారీగా హాజరై విజయవంతం చేసిన పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చూపుతున్న విశ్వాసం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి వారు చూపిన కృషి ప్రశంసనీయమన్నారు. అలాగే కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి, పోలీసు శాఖ సిబ్బందికి, డీఎస్బీ వాలంటీర్లకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
వారి సమన్వయం, క్రమశిక్షణ వల్ల సభ విజయవంతంగా పూర్తైందన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
