ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి

ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి

  • ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలన్న ఉద్దేశంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే మామిడాల రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. కంప్యూటర్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ఇలాంటి శిబిరాలను పాలకుర్తి ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గుణం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని 400 మందికి పైగా విద్యార్థులు వినియోగించుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply